సౌతాఫ్రికాలో ఐపీఎల్-2019?

ముంబయి: వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 సీజన్‌ను సౌతాఫ్రికా లేదా యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా భారత్ ఆవల నిర్వహిస్తామని చెప్పలేమని, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా వేదికలో మార్పులుంటాయని చెబుతున్నారు. దీనిలో భాగంగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి నుంచే ముందస్తు సన్నాహాలు చేస్తోంది. సాధారణ ఎన్నికలు, ఐపీఎల్ ఏకకాలంలో జరిగితే మ్యాచ్‌లకు భద్రత కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇదే కారణంతో గతంలో 2009 టోర్నీని సౌతాఫ్రికాలో, 2014 టోర్నీలో సగం మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల తేదీలు, ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అయితే తప్పకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను భారత్ ఆవల నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు వేచి చూడాలని బీసీసీఐ నిర్ణయించిందని, ఎన్నికల షెడ్యూల్ తరువాతనే ఐపీఎల్ నిర్వహణ వేదిక, తేదీలపై తుదినిర్ణయం ప్రకటిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.

Related Stories: