అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 250, రెండో ఇన్నింగ్స్ 307 కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 235, రెండో ఇన్నింగ్స్ 291 పరుగులు. అయితే.. ఈ టెస్ట్ గెలుపు భారత్‌కు ఎన్నో రికార్డులకు నాంది పలికింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్‌లో విజయం సాధించింది. చివరిసారిగా 2008 జనవరిలో పెర్త్ టెస్టులో భారత్ నెగ్గింది. ఆసీస్ గడ్డపై సిరీస్ తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో ఆడిన 45 టెస్టుల్లో భారత్‌కు ఇది ఆరో విజయం. అడిలైట్‌లో మాత్రం భారత్‌కు ఇది కేవలం రెండో విజయం మాత్రమే. 2003-04 పర్యటనలో అడిలైట్ టెస్టును 4 వికెట్లతో భారత్ నెగ్గింది. గత రెండు పర్యటనల్లోనూ భారత్ ఒక్క టెస్టు కూడా గెలవలేదు.

Related Stories: