బ్రాహ్మణ పరిషత్ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వివేకానంద విదేశీ విద్యాపథకం, రామానుజ పథకం, బెస్ట్ పథకాల కోసం బ్రాహ్మణ విద్యార్థులు బుధవారం నుంచి అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమపరిషత్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.