నిరుద్యోగ డ్రైవర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : షెడ్యుల్డ్ కులాల సేవా సహాకార అభివృద్ధ్ది సంస్థ షెడ్యుల్డ్ కులాల కార్యచరణ ప్రణాళిక 2018-19 సంవత్సరంలో చేపడుతున్న డ్రైవర్ ఎస్ పవర్‌మెంట్ కార్యక్రమం ద్వారా కార్ టాక్సీలు, మోటార్ బైక్ పథకాలకు జిల్లాలోని షె డ్యుల్ కులాల నిరుద్యోగ అభ్యర్థుల(డ్రైవర్)నుంచి ద రఖాస్తులు కోర డం జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఓలా, మేరు, స్విగ్గి, బిగ్ బాస్కెట్ అను ప్రైవేట్ సంస్థలకు అనుసంధానం చేయబడుతుందని అన్నారు.

18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలవారు అయి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్‌లో లబ్ధిపొందని వారై ఉండాలన్నారు. 2018-19 యొక్క ఇ తర నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, రేషన్ కార్డు, స్థానిక ధ్రువీకరణ పత్రం మొదలైన వాటిని ఆన్‌లైన్‌లో ఈనెల 5వ తేదీనుంచి 20వ తేదీలోపు చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేయదలచిన వారు ఆన్‌లైన్ సైట్ చిరునామా http;// tsobmms.cgg.gov.in నందు నమోదు చేయాలని తెలిపారు.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..