నీరవ్ సోదరిపై రెడ్‌కార్నర్ నోటీసు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పీఎన్‌బీని మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి పూర్వీ మోదీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసింది. బెల్జీయంపౌర సత్వం ఉన్న పూర్వీకి పీఎన్‌బీలో జరిగిన 200 కోట్ల డాలర్ల మోసం కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో 44 ఏండ్ల వయస్సు కలిగిన పూర్వీ దీపక్ మోదీని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఈ భారీ స్కాంలో పూర్వీ మోదీ కనీసంగా 133 మిలియన్ డాలర్లు లేదా రూ.950 కోట్లకు పైగా ఆయాచితంగా లాభపడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్(సీబీఐ)లు ఆరోపిస్తున్నాయి. దుబాయి, బ్రిటిష్ వర్జిన్ ఐస్‌ల్యాండ్స్, సింగపూర్ దేశాల్లో ఏర్పాటైన పలు షెల్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలకు యజమానిగాను, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఏజెన్సీలు పేర్కొన్నాయి.

Related Stories: