పొగమంచు వల్ల 11విమానాలు ఆలస్యం

ఢిల్లీ: ఉత్తరాదిన పొగ మంచు కమ్మేస్తుంది. రాజధాని నగరం ఢిల్లీలో వేకువ జాము నుంచే పలు ప్రాంతాలను పొగ మంచు కప్పేసింది. పొగ మంచు ప్రభావంతో ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టు నుంచి 11 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగ మంచు ధాటికి 12 విమాన సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. రెండు విమానాలను రద్దు చేశారు. మరోవైపు 54 రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు 12 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

Related Stories: