ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన ఫీచర్..!

ప్రముఖ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లకు మరో నూతన ఫీచర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై అందులో యూజర్లు జిఫ్ ఇమేజ్‌లను నేరుగానే పంపుకోవచ్చు. మెసేజ్‌లను కంపోజ్ చేసేటప్పుడు పక్కనే ఉండే కంపోజింగ్ బార్‌లోని లైబ్రరీని ఓపెన్ చేస్తే అందులో జిఫీ పవర్డ్ జిఫ్‌లు కనిపిస్తాయి. వాటిని స్వైప్ చేస్తే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న జిఫ్ ఇమేజ్‌లు కనిపిస్తాయి. లేదంటే కీవర్డ్‌ల ద్వారా కూడా జిఫ్‌లను వెదకవచ్చు. అనంతరం వాటిని మెసేజ్‌లో సెండ్ చేసుకోవచ్చు. వన్ టు వన్ మెసేజ్ లేదా గ్రూప్ చాట్‌లో వాటిని పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

Related Stories: