విలీన మండలాలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీలో విలీనంచేసిన ఏడు మండలాలకుచెందిన అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయకుండాఎన్నికలు నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీచేయాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేశారు. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ, న్యాయ, శాసన వ్యవహారాలశాఖ కార్యదర్శులు, రెండు రాష్ర్టాల ఎన్నికల సంఘం కార్యదర్శులు, సీఎస్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదావేసింది.