నిర్మ‌ల్ లో సీఎం కేసీఆర్ స‌భ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అల్లోల‌

నిర్మల్ : ఈ నెల 22న నిర్మ‌ల్ లో నిర్వహించిన సీఎం కేసీఆర్ స‌భకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు. ఎల్ల‌ప‌ల్లి క్ర‌ష‌ర్ రోడ్ మైదానంలో సభా ప్రాంగణం, వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను, మైదానం చదును చేసే పనులను మంత్రి అల్లోల పరిశీలించారు. పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులతో సభ ఏర్పాట్లపై చర్చించారు.

భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివస్తారని..వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరానున్న నేప‌థ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా చర్యలు తీసుకోవడం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఆయ‌న‌ తెలిపారు. మహిళల కోసం ప్ర‌త్యేకంగా గ్యాల‌రీ, తక్కువ దూరంలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, మంచినీటి సౌక‌ర్యం, అంబులెన్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం ఎన్నిక‌ల శంఖారావ‌ సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు న‌ల్లా ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, స‌త్య‌నారాయ‌ణ గౌడ్, డాక్టర్ కె.మ‌ల్లికార్జున రెడ్డి, న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, అల్లోల ముర‌ళీధ‌ర్ రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, తదితరులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట ఉన్నారు.

Related Stories: