శ్రీలంకలో భారతీయ హెల్ప్‌లైన్ నెంబర్లు

ఢిల్లీ: శ్రీలంకలో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సాయానికి, సమాచారానికి స్థానికంగా ఉన్న భారతీయులు కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు. తాము అన్ని విధాలుగా సహాయ సహకరాలు అందజేయనున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు: 94777903082, 94112422788, 94112422789, 94112422789.
More in అంతర్జాతీయం :