టీమిండియా మ్యాచ్‌లో కేసీఆర్ ప్ల‌కార్డులు

బ్రిస్బేన్: గ‌బ్బా స్టేడియంలో కేసీఆర్ ప్ల‌కార్డులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఇవాళ ఆస్ట్రేలియాతో టీమిండియా బ్రిస్బేన్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లిన తెలంగాణ ప్రేక్ష‌కులు.. సీఎం కేసీఆర్ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. భారీ సంఖ్య‌లో మ్యాచ్‌ను తిల‌కించిన‌ తెలంగాణ అభిమానులు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ గెల‌వాల‌ని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. కేసీఆర్ అంటే కీప్ కార్ ర‌న్నింగ్ అంటూ ఆ ప్ల‌కార్డుల‌పై నినాదాలు రాశారు. కిక్కిరిసిన స్టేడియంలో కేసీఆర్ ప్ల‌కార్డులు ఆసీస్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశాయి. రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని కూడా బ్రిస్బేన్‌లోని తెలంగాణ అభిమానులు నినాదాలు చేశారు. ఒక‌వైపు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌గా, మ‌రో వైపు కేసీఆర్ అభిమానులు త‌మ వ‌ద్ద ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ.. టీఆర్ఎస్ విక్ట‌రీని సూచించారు.

Related Stories: