ఐదు అడుగుల పైతాన్‌ను కాపాడారు..

న్యూఢిల్లీ: అటవీ ప్రాంతం నుంచి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన పైతాన్‌ను విల్డ్‌లైఫ్ ఎన్జీవో సభ్యులు కాపాడారు. గుర్‌గావ్‌లో సంకల్ప్‌జైన్ అనే వ్యక్తి తన ఇంటి ప్రాంగణంలో ఉన్న పచ్చిక బయళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. సంకల్ప్ జైన్ రోడ్డుపై నడుస్తూ ఉండగా తన ఇంటి పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. దీంతో అతడు పొదల దగ్గరకెళ్లి చూడగా కుండల చాటున ఐదడుగుల (ఇండియన్ రాక్ పైతాన్) కొండచిలువ కనిపించింది.

సంకల్ప్ వెంటనే స్వచ్చంద సంస్థకు ఫోన్ చేశాడు. స్వచ్చంద సంస్థ సభ్యులు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. చిన్న చిన్న కప్పలు, ఎలుకలు, పక్షులు, ఇతర కీటకాలను తినేందుకు కొండచిలువ జనవాసాల్లోకి వచ్చిందని, ఈ ఫైతాన్ విషరహితమైనదని విల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ సహ వ్యవస్థాపకుడు కార్టిక్ సత్యనారాయణ్ తెలిపారు. అయితే ఇండియన్ రాక్ పైతాన్ పరిమాణంలో పెద్దగా ఉండటం వల్లన చాలా మంది విషపూరితమైనదని తప్పుగా భావించి దానిని చంపేస్తారని అన్నారు. ఈ పైతాన్లు ఆహారం కోసం జనావాసాల్లోకి కనిపించడంతో వాటిని చంపేస్తున్నారని చెప్పారు.

Related Stories: