ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడాడని రూంమేట్‌నే చంపాడు..

దుబాయ్: ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడని ఓ వ్యక్తి తన రూంమేట్‌ నే చంపేసిన ఆశ్చర్యకర ఘటన దుబాయ్‌లో వెలుగుచూసింది. 37 ఏండ్ల వ్యక్తి దుబాయ్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సదరు వ్యక్తి తన రూంమేట్‌తో కలిసి ఓ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. పార్టీ సమయంలో ఓ కాల్ చేసేందుకు కార్మికుడి సెల్‌ఫోన్‌ను అతని రూంమేట్ అడిగి తీసుకున్నాడు. అదే సమయంలో ఫోన్ ఇచ్చిన వ్యక్తి మద్యం తాగుతూ ఉన్నాడు. రూంమేట్ ఫోన్ కాల్ చేసి బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. కార్మికుడికి చిర్రొత్తుకొచ్చి అతని రూంమేట్‌ను మెల్లగా మాట్లాడాలని కోరాడు.

అతడు ఎంతకీ వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన కార్మికుడు అతని రూంమేట్‌ను కత్తితో పొట్టలో పొడిచాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుడు ఓ మంచం కిందున్న కత్తిని తీసుకువచ్చి బాధిత వ్యక్తి పొట్టలో పొడిచి..అక్కడి నుంచి పారిపోయాడని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. నిందితుడు కత్తిని తన చొక్కా లోపల దాటి విశ్రాంతి గదికి పరుగెత్తినట్లు సీసీ టీవీ వీడియో రికార్డయింది. సీసీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Stories: