సంస్కరణల బాటలో సైన్యం

-ఐదేండ్లలో 1.5 లక్షల మంది జవాన్లకు ఉద్వాసన -మిగులు నిధులతో అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు ప్రణాళిక
న్యూఢిల్లీ: సైన్యంలో సంస్కరణలు తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సైనికాధిపతి జనరల్ బిపిన్ రావత్ మంగళవారం ఆర్మీ కమాండర్లతో చర్చించనున్నారు. మొ త్తం సైన్యాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు సిబ్బంది సంఖ్య తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని సమాచారం. తద్వారా ఆదా అయ్యే రూ. 5000-7000 కోట్లతో అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తున్నది. సైనిక సిబ్బందిని 10 లక్షల మందికి పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం 2023 నాటికి 1.5 లక్షల మంది సైనిక జవాన్లను తొలిగించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండేండ్లలో సుమారు 50 వేల మంది.. తర్వాత మూడేండ్లలో లక్ష ఉద్యోగాల కోత విధించాలని కేంద్రం భావిస్తున్నది. 13 లక్షల మంది జవాన్లు గల సైన్యంలోని కొన్ని విభాగాలను విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Stories: