టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

లండన్‌: విశ్వసమరానికి సన్నద్ధమయ్యేందుకు విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్ల మ్యాచ్‌కు ముందుగా బ్యాట్స్‌మెన్‌ అలవాటు పడేందుకు తొలుత బ్యాటింగ్‌ చేయడానికే కోహ్లీ మొగ్గుచూపాడు. ఇప్పటికే జట్టులోని అన్ని స్థానాలకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వరల్డ్‌కప్‌ టోర్నీ మ్యాచ్‌లకు తుదిజట్టుపై అవగాహన వచ్చేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు వీలుకానుంది.