జూనియర్ షూటర్ల జోరు..

-టీమ్ విభాగంలో రజతం కైవసం -కాంస్యంతో మెరిసిన యువ గుర్నిహాల్ చాంగ్వాన్: ట్రాప్, డబుల్ ట్రాప్ అన్ని విభాగాల్లో పతకాలు సాధించి ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త రికార్డు నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోటీలో టీమ్ విభాగంలో రజతం, వ్యక్తిగత విభాగంలో గుర్నిహాల్ సింగ్ కాంస్యంతో మెరిశాడు. టీమ్ విభాగంలో 255 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచిన భారత యువ జట్టు రజతం దక్కించుకుంది. టీమ్ విభాగంలో గుర్నిహాల్ (119), అనంత్‌జీత్ సింగ్ (117), ఆయుష్ రుద్రరాజు(119) పాయింట్లతో రాణించారు. 356 పాయింట్లతో చెక్ రిపబ్లిక్ జట్టు పసిడి పతకం అందుకుంది. వ్యక్తిగత విభాగంలో జరిగిన పోటీలో యువ గుర్నిహాల్ 46 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి కంచు పతకం కైవసం చేసుకున్నాడు. ఇటలీకి చెందిన ఎలియా 55 పాయింట్లతో స్వర్ణం గెలవగా.. అమెరికా షూటర్ నిక్ మాస్కెటి 54 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి రజతం సాధించాడు.