ట్రంప్ భద్రత సిబ్బందిలో భారతీయ సిక్కు

తలపాగా ధరించి విధులు నిర్వర్తించేందుకు కోర్టు అనుమతి న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సిక్కు పౌరుడు అన్షుదీప్ సింగ్ భాటియా అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్‌వద్ద భద్రత అధికారిగా విధులు నిర్వర్తించ నున్నారు. ట్రంప్ భద్రతదళంలో పనిచేయాలంటే వస్త్రదారణ మార్చాలని.. తలపాగా తొలగించాలని అన్షుదీప్‌సింగ్‌ను అమెరికా భద్రతాఅధికారులు కోరారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. దీనిపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ స్పందిస్తూ తలపాగా ధరించిన ఓ సిక్కు అమెరికా అధ్యక్షుడి భద్రతదళంలో పనిచేయడం సిక్కుసమాజానికి గర్వకారణమని బుధవారం ట్వీట్ చేశారు.