చైనా దూకుడుపై భారత్-వియత్నాం చర్చలు

ఢిల్లీ: ఆసియా ప్రాంతంలో చైనా దూకుడుపై భారత్-వియత్నాంలు చర్చలు జరిపాయి. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకోవడంతోపాటు తమ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. వియత్నాం ఉపప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్ మిన్ తన నాలుగు రోజుల భారత పర్యటన ముగించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలు పురోగతిపై తాను భారత్‌తో చర్చించినట్టు చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్‌తోపాటు పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. వియత్నాం జలాల్లో భారత్ చమురు అన్వేషణను కూడా చైనా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. చైనా అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్ తాము అంతర్జాతీయ చట్టాల ప్రకారమే వియత్నాంతో సంబంధాలను నెరుపుతున్నాయని పేర్కొంది.
× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి