త్వరలో వైద్యశాఖలో రెండువేల పోస్టుల భర్తీ

-జిల్లా కేంద్ర దవాఖానల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్: మంత్రి లకా్ష్మరెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రతి జిల్లా కేంద్ర దవాఖానలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి చెప్పారు. వైద్యారోగ్యశాఖలో 2 వేల పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని, కొత్తగా మంజూరై న, అప్‌గేడ్ అయిన దవాఖానలకు కొత్తగా పోస్టులను మంజూరు అంశం ప్రభు త్వ పరిశీలనలో ఉందని చెప్పారు. బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానను సందర్శించారు. దవాఖాన ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే ఎంఎన్‌జే దవాఖానలో చికిత్స ఉందని, ఇటీవల ఖమ్మంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. మిగిలిన అన్ని జిల్లా కేంద్ర దవాఖానల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగారెడ్డి దవాఖానకు అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు, గార్డెన్ ఆధునీరణ కోసం రూ.కోటి మంజూరు చేశామని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు తర్వలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. 150 పడకల మాతాశిశు హెల్త్ సెంటర్‌ను రెండు నెలల్లో పూర్తి చేసి అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: