నిట్‌కు సోలార్ పవర్..

వరంగల్ :వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం(నిట్) సహజవనరుల వినియోగంలో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అధునాతన టెక్నాలజీ వినియోగిస్తున్న నిట్‌లో అన్ని సాంకేతిక భవనాలు, హాస్టల్ బ్లాకుల కోసం సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా విద్యుత్ ఖర్చును ఆదా చేసేందుకు నిర్ణయించి 999.7 కిలోవాట్ల సామర్ధ్యం గలిగిన సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నిట్ డైరెక్టర్ యన్వీ రమణారావు సోలార్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 4000 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని తెలిపారు.12 బ్లాకులకు నిరంతరం సోలార్ పవర్ అందుతుందని, దీనివల్ల నిట్‌కు సుమారు 16 నుంచి 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలార్ రూఫ్ టాఫ్ ప్రాజెక్టు నోడల్ ఆఫీసర్ యన్.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గ్గొన్నారు.

Related Stories: