సర్జిక స్టెక్స్‌లో చిరుతపులుల మలమూత్రాలు!

న్యూఢిల్లీ: చిరుత మలమూత్రాలతో సర్జికల్ ైస్ట్రెక్స్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? భారత సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిపినప్పటి సంగతి ఇది. 2016లో భారత సైన్యం పీఓకేలో లక్షిత దాడులు జరిపినప్పుడు ఎంతో పకడ్బందీగా వ్యూహం రచించారు. పీఓకే గ్రామాల్లోని కుక్కలు తమ వ్యూహాన్ని భగ్నం చేయకుండా వారు చిరుతపులుల మలమూత్రాలను ఉపయోగించారు. ఈ విషయాన్ని నౌషెరా సెక్టార్‌లో బ్రిగేడ్ కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర నింబోర్కర్ వెల్లడించారు. తమ మార్గానికి అడ్డువచ్చే కుక్కలను తరిమేసేందుకు చిరుత మూత్రాన్ని ఉపయోగించామని ఆయన చెప్పారు. ఆ దాడుల్లో పాల్గొన్న నింబోర్కర్‌ను పుణెలోని థోర్లే బాజీరావు పేష్వా ప్రతిష్ఠాన్ సంస్థవారు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులు జరుపడానికి ముందు ఆప్రాంత జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేశాను. ఆ ప్రాంతం లో చిరుతపులులు తరచుగా కుక్కలపై దాడి చేస్తుంటాయి. దీంతో కుక్కలు రాత్రివేళ గ్రామాలను వదిలి బయటకు వచ్చేవికావు. మేము ఉగ్రవాదుల స్థావరాలవైపు వెళ్లే క్రమంలో గ్రామాలను దాటేటప్పుడు కుక్కలు మమ్మల్ని చూసి అరవడం లేదా మాపై దాడి చేసే అవకాశాలుంటాయని అంచనా వేశాం.

కుక్కల నోరు మూయించేందుకు చిరుతపులుల మలమూత్రాలు ఉపయోగించాలని నిర్ణయిం చాం. లక్షిత దాడులు చేయడానికి వెళ్లినప్పుడు గ్రామాల వెలుపల చిరుతపులుల మలమూత్రాలను అక్కడక్కడా చల్లుకుంటూ వెళ్లాం. ఆ వాసన పసిగట్టిన కుక్కలు బయటకు రాలేదు. దీంతో మా దారికి అడ్డులేకుండా పోయింది అని చెప్పారు. 2016 సెప్టెంబర్18న పాకిస్థాన్ ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి వచ్చి ఓ ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడి 19మంది సైనికులను హతమార్చారు. అందుకు ప్రతీకారంగా భారత సైన్యం అదే నెల 29న పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడులు చేసి 50 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

Related Stories: