రామయ్య సన్నిధిలో ముక్కోటి అధ్యయనోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం రామయ్య సన్నిధిలో ముక్కోటి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు వరాహావతారంలో భక్తులకు స్వామివారి దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు నిత్య కల్యాణాలు, వెండిరథ సేవలు రద్దు చేశారు. ఈనెల 17న లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. ఈనెల 18న భద్రాచలంలో వైకుంఠ ద్వార దర్శనం అమలు చేస్తారు. అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉత్సవాల్లో భాగంగా మిథిలా ప్రాంగణం వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

Related Stories: