వినాయక నిమజ్జన ఘట్టానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

హైదరాబాద్ : గణనాథుడి మహా నిమజ్జన ఘట్టానికి జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లూ దాదాపు పూర్తయ్యాయి. శోభాయాత్ర నిర్వహించే సుమా రు 370 కిలోమీటర్ల ప్రధాన రోడ్లపై గుంతల పూడ్చివేత, మరమ్మతు పనులు తుదిదశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఈ మార్గాల్లో ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ప్రత్యేక పారిశుధ్య బృందాలను కూడా నియమించారు. రెండు రోజులుగా కురుస్తున్న జల్లుల కారణంగా రోడ్డు మరమ్మతు పనులకు అంతరా యం ఏర్పడినప్పటికీ కోల్డ్ బిటమిన్‌తో పనులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 23న, ఆదివారం ప్రధాన శోభాయాత్ర జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 13న వినాయకచవితి పండుగనాటినుంచి రోజూ గణనాథుడి విగ్రహాల నిమ్మజనం కొనసాగుతూనే ఉంది. అయితే భారీ సైజుల్లో ఉండే ప్రధాన విగ్రహాలు, ముఖ్యంగా పాతబస్తీ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో నెలకొల్పిన విగ్రహాల నిమజ్జనం చివరిరోజైన ఆదివారమే జరుగనుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌సహా దాదాపు 35 ప్రా ంతాల్లో క్రేన్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. ఇందులో 20 చోట్ల నిమజ్జన కొలనులను సిద్ధం చేశారు. ఇదిలావుండగా... ఊరేగింపు సజావుగా సాగే విధంగా ఆయా ప్రధా న మార్గాల్లో రోడ్లపై గుంతల పూడ్చివేత, మరమ్మతు పను లు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజువారీ నిర్వహణలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ వద్ద క్రేన్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. సుమారు రూ. 10కోట్లతో బల్ది యా ప్రధాన ఊరేగింపు మార్గాల్లో రోడ్లపై గుంతల పూడ్చివేత, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. రూ. 5.4కోట్లతో క్రేన్లను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తగా నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. ఊరేగింపు మార్గాల్లో ఇబ్బంది కలుగకుండా ఉం డేందు కు అడ్డుగా ఉన్న చెట్లను తొలిగించేందుకు సర్కిల్‌కి ఒకటి చొప్పున హార్టికల్చర్ బృందాన్ని రెండు షిఫ్టుల్లో నియమించారు.

Related Stories: