సుక్మా జిల్లాలో ఐఈడీ పేలి గ్రామస్తుడి మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని బుర్కపాల్ ప్రాంతానికి చేందిన సోంది కోసా(47) అనే గ్రామస్తుడు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి దుర్మరణం పాలయ్యాడు. తెలిసిన వివరాల ప్రకారం.. బుర్కపాల్‌కు ఎందిన సోంది కోసా పని ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో గ్రామ సమీపంలోని చప్టా కింద మావోయిస్టులు అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)పై సోంది ప్రమాదవశాత్తు కాలువేశాడు. భారీ విస్ఫోటనం జరిగి కోసా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related Stories: