విజయ్‌కి ఓకే

shankar లండన్: భారత క్రికెట్ జట్టుకు ఉపశమనం లభించింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీకి కోసం సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయం అంత తీవ్రంగా లేదని తేలింది. న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్ కోసం శుక్రవారం జరిగిన నెట్ సెషన్‌లో ఖలీల్ అహ్మద్ విసిరిన బంతి..శంకర్ మోచేతికి బలంగా తాకింది. వెంటనే అప్రమత్తమైన టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ శంకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎక్స్‌రే పరీక్షలో ఎముక విరుగలేదని నివేదికలో బయటపడిందని బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.