రేవంత్ రెడ్డి నాపై దుష్ప్రచారం చేస్తున్నరు: ఎంపీ కొండా

హైదరాబాద్: రాజీనామా వార్తలను చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నరని కొండావిశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తాను కొద్ది సేపటి క్రితమే మంత్రి కేటీఆర్‌ను కలిశానని, పార్టీకి తాను రాజీనామా చేశానన్న వార్తలు అవాస్తవమని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ లో చేరుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కొండా పైవిధంగా స్పందించారు.

Related Stories: