ఐఏసీసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పూర్ణచందర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణః హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ పూర్ణచందర్‌రావు ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో ఐఏసీసీ దక్షిణ భారతశాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు.