శ‌బ‌రిమ‌ల‌కు 17న తృప్తీ దేశాయ్‌

న్యూఢిల్లీ: భూమాతా బ్రిగేడ్ కార్య‌క‌ర్త తృప్తీ దేశాయ్‌.. ఈనెల 17వ తేదీన శ‌బ‌రిమ‌ల వెళ్లేందుకు సిద్ద‌మైంది. రెండు నెల‌ల మండ‌ల పూజ‌ల కోసం ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. తృప్తీ దేశాయ్ మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడుతున్నారు. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న‌ట్లు ఆమె కేర‌ళ సీఎం విజ‌య‌న్‌కు లేఖ రాశారు. త‌న రాక సంద‌ర్భంగా భ‌ద్ర‌త‌ను పెంచాల‌ని ఆమె ఆ లేఖ‌లో కోరారు. 2016లో మ‌హిళా కార్య‌క‌ర్త‌ల బృందంతో తృప్తీ .. మ‌హారాష్ట్ర‌లోని శ‌ని శింగ‌నాపూర్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఆ ఆల‌యంలో కూడా గ‌త 60 ఏళ్లుగా మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేదు. అయితే ఆ సాంప్ర‌దాయాన్ని ఆమె బ్రేక్ చేశారు.

Related Stories: