ఇంకా పదేళ్లు నేనే సీఎంగా ఉంటా: కేసీఆర్

బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మారుతాడన్న పుకార్లపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని చాలా దుష్ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ దిగిపోయి కుమారుడు కేటీఆర్‌ను కుర్చీలో కూర్చోబెడతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ అబద్దం. నాకేమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలోకి వస్తుంది. నాకిప్పుడు 66 ఏళ్లు వచ్చాయి. కనీసం ఇంకో పదేైళ్లెనా పని చేయగలుగుతా. ఎవరెన్ని శాపాలు పెట్టినా నాకు అవి దీవెనలుగా పనిచేస్తాయి. ఇంకా రెండు పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని తెలిపారు.