పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం: ప్రియాంక

తొలి సినిమా విడుదల కాకముందే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది టాలీవుడ్ కొత్త హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న టాక్సీవాలా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. టాక్సీవాలా నవంబర్ 17న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేసింది ప్రియాంక జవాల్కర్. ‘నేను మరాఠీ అమ్మాయే అయినా..తెలుగు మాట్లాడటం వచ్చు. నా చదువంతా అనంతపురంలోనే పూర్తయింది. ఇంజినీరింగ్ అయిపోయాక హైదరాబాద్ వచ్చి ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేశాను. ఓ షార్ట్ ఫిలింలో నటించాను. బన్నీవాసుకు ఫొటోలు పంపితే..ఆడిషన్స్ కు రమ్మన్నారు. ఆడిషన్స్ తర్వాత సినిమాకు ఎంపికయ్యా. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నా. డైరెక్టర్ కూడా నాతోనే డబ్బింగ్ చెప్పించారు. నాకు చిన్నప్పటి నుంచి ఐశ్వర్యారాయ్ అంటే చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్ చూసిన తర్వాత నాకు నటి కావాలనే కోరిక కలిగింది. నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానం’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక.

Related Stories: