ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలను నమ్మను: కాజోల్

ముంబై: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కీలక పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జయంతిలాల్ గదా, అజయ్ దేవ్‌గన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను కాజోల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేసింది కాజోల్.

విద్యాబాలన్, రాణీ ముఖర్జీ తుమ్హారీ సులు, కహానీ, హిచ్‌కీ, మార్దాని వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. మీరు అలాంటి జోన్ సినిమాలపైనే దృష్టి పెట్టారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ..నేను మహిళా ప్రధాన చిత్రాలను నమ్మను. మంచి సినిమాలు, మంచి కథలనే నమ్ముతానని చెప్పింది. ‘హెలికాప్టర్ ఈలా’ చిత్రంలో కాజోల్ ఆధునిక కాలంలోని తల్లి పాత్ర పోషిస్తోంది.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..