మిగతా హీరోల తరహాలో నేను నటించలేను..

కథే నా దృష్టిలో హీరో. నేను విశ్వసించే సిద్ధాంతం అదే అన్నారు విజయ్ ఆంటోనీ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రోషగాడు. నివేథా పెతురాజ్ కథానాయిక. గణేష దర్శకుడు. నిర్మాత పార్వతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 16న విడుదలకానుంది.

ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ మిగతా హీరోల తరహాలో నేను నటించలేను. కానీ నటుడిని అవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచనతోనే వినూత్నమైన కథల్ని ఎంపికచేసుకుంటున్నాను. కథ రాయడంలో చాలా కష్టం ఇమిడి ఉంటుంది. అందుకే దర్శకుల్ని నేను హీరోలుగా భావిస్తాను అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ రచయిత విజయేంద్రప్రసాద్ నా గురువు. సింహాద్రి నుంచి ఆయన వద్ద పలు సినిమాలకు పనిచేశాను. ఆయనకు ఈ సినిమా కథ వినిపించాను. ఇప్పటివరకు పోలీస్ పాత్ర చేయని హీరోతో ఈ సినిమా చేయమని సలహా ఇచ్చారు. ఆయనే విజయ్ ఆంటోనీ పేరును సూచించారు. నా దృష్టిలో విజయ్ ఆంటోనీనే ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని తెలుగులో రోషగాడు హీరో అని పిలుస్తారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే ఓ పోలీస్ అధికారి కథతో తెరకెక్కించాం అన్నారు.

Related Stories: