పప్పు చేయడం తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని నేను!

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్న మాటలివి. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆయన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. ఈ సదస్సులో భాగంగా కరణ్ థాపర్‌తో ఒబామా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇండియా ఫేవరెట్ డిష్ అయిన పప్పు ఎలా చేయాలో తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని తానే అని ఒబామా చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. హోటల్లో ఉన్న సమయంలో ఓ వెయిటర్ తనకు పప్పు వడ్డించి.. అది ఎలా చేస్తారో చెప్పే ప్రయత్నం చేశాడని ఒబామా తెలిపారు. అయితే అది తనకు తెలుసని, తాను స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే ఓ ఇండియన్ రూమ్‌మేట్ ద్వారా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నానని ఆయన చెప్పడం విశేషం. అంతేకాదు తాను చేసిన కీమా కూడా అద్భుతంగా ఉంటుందని ఒబామా అన్నారు. చికెన్ కూడా బాగానే చేస్తానని చెప్పారు. మరి చెపాతీ చేయడం వచ్చా అని కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించగా.. అది అస్సలు రాదు.. చెపాతీ చేయడం చాలా కష్టమంటూ ఒబామా చెప్పారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..