జూబ్లీ నుంచి ఎంజీబీఎస్.. నవంబర్‌లో మెట్రో

-అందుబాటులోకి రానున్న 66 కిలోమీటర్ల మార్గం సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు మార్గం నవంబర్‌లో అందుబాటులోకి రానున్నది. దీంతో మొదటి దశ 66 కిలోమీటర్ల మార్గం పూర్తవుతుంది. కారిడార్-2కు సంబంధించి జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు గల 15 కిలోమీటర్లలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9.66 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఈ మార్గంలోని 9 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైలు మార్గంతో పాటు విద్యుత్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జేబీఎస్ ఇంటర్‌చేంజ్ స్టేషన్, ఎంజీబీఎస్ స్టేషన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. సిగ్నలింగ్, కొన్ని స్టేషన్లు పూర్తయితే దాదాపు మెట్రోరైలు ప్రాజెక్టులో మొదటి దశ పూర్తవుతుంది. మొదటిదశ మెట్రోరైలు నవంబర్ నెలలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇదే నెలలో కారిడార్2కు సంబంధించి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం కూడా అందుబాటులోకి రావడం వల్ల మొట్రోరైలు 66 కిలోమీటర్ల మార్గం ప్రయాణానికి సిద్ధమవుతుంది. కారిడార్2కు సంబంధించి జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గల 9.66 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఈ మార్గంలో 9 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన రైలు మార్గంతోపాటు విద్యుత్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జేబీఎస్ ఇంటర్‌చేంజ్ స్టేషన్‌తోపాటు ఎంజీబీఎస్ స్టేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సిగ్నలింగ్ పనులు, కొన్ని స్టేషన్లు పూర్తయితే దాదాపు మెట్రోరైలు ప్రాజెక్టులో మొత్తం 66 కిలోమీటర్లు పూర్తవుతాయి. ఇప్పటికే కారిడార్1కి సంబంధించి ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్లు, కారిడార్ 3 కు సంబంధించి నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 27 కిలోమీటర్లు ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు అందుబాటులోకి వస్తే పాతబస్తీ ప్రజలకు ఎంతో ప్ర యోజనకరంగా ఉండనుంది.నగరం నడిబొడ్డునుంచి వెళ్లే ఈ మార్గం నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ రెండు ముఖ్యమైన బస్‌స్టేషన్‌లను అనుసంధానం చేస్తుంది. ఇక జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ ఆపరేషన్స్ ప్రారంభం ఒక ఎత్తైతే కారిడార్1తోపాటు కారి డార్3 కు కూడా కనెక్టవుతుంది. దీంతో నగరం నుంచి ఏ మూలకు వెళ్ళాలన్నా మెట్రో ద్వారా వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. దేశంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ నవంబర్ నాటికి సీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు గల 6 కిలో మీటర్ల మార్గాన్ని మినహాయించి 66 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తుంది.72 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో 56 కిలోమీటర్ల మెట్రోప్రయాణం అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ ప్రారంభం కావడంతో ఢిల్లీ మెట్రో తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టుగా అవతరించింది. ఐతే కారిడార్ 2కు సంబంధించి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గల 9 కిలో మీటర్లతోపాటు హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కిలో మీటర్ల మార్గాన్ని వచ్చే నవంబర్ చివరినాటికి పూర్తిచేస్తాం. -ఎన్వీఎస్ రెడ్డి , మెట్రోరైలు ఎండీ

Related Stories: