మనూలో కొత్తగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు

-దరఖాస్తులకు జూన్ 30వరకు తుది గడువు సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ రెండు బ్యాచిలర్ ఒకేషనల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది. జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్ వర్క్ ప్రోగ్రామ్‌లో భాగంగా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ(ఎంఎల్‌టీ), మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ(ఎంఐటీ) కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు కోర్సులు మూడేండ్ల కాలపరిమితితో ఉంటాయని, అన్ని ప్రభుత్వ, మల్టీ స్పెషాలిటీ దవాఖానల్లో విద్యార్థులకు శిక్షణను కల్పించేందుకు ఇప్పటికే యూజీసీ అనుమతి ఇచ్చినట్లు నోడల్ అధికారి డాక్టర్ ఎస్.మక్బూల్ అహ్మద్ తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ అర్హతతో పాటు ఇంటర్‌లో తప్పనిసరిగా సైన్స్ సబ్జెక్టు చదివి ఉం డాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతిగృహం అవకాశం కల్పించనున్నారు. ఈ కోర్సుల్లో పరిమితి సీట్లకు అవకాశం ఇవ్వడంతోపాటు రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 30తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవా ల్సి ఉన్నది. పూర్తి వివరాలకు www.manuu.ac.in వెబ్‌సైట్‌లో సందర్శించొచ్చు.

Related Stories: