ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

సిటీబ్యూరో/కొండాపూర్, నమస్తే తెలంగాణ : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం 2019వ సంవత్సరం దూరవిద్యలో జూలై అడ్మిషన్లకై దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మాదాపూర్‌లోని ఇగ్నో ప్రాంతీయ కార్యాలయం సంచాలకులు డాక్టర్ ఎస్.ఫయాజ్ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇగ్నో అందిస్తున్న వివిధ ప్రోగ్రాములైన సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీల్లో చేరడానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో చేరదల్చిన వారు జూలై 15వ తేదీ వరకు, ఇతర కోర్సుల్లో చేరేవారు జూలై 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఇగ్నో వెబ్‌సైట్ www.ignou.ac.inలో దరఖాస్తులు చేసుకోవాలని, ఇతర సమాచారానికి 949 2451812, 040-23117550 నంబర్లలో సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు.

Related Stories: