కోర్టు విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహకాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కోర్టు విధుల్లో ఉత్తమ పనితనాన్ని కనబరిచిన సిబ్బందికి మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన ప్రోత్సాహకాలను మంగళవారం సీపీ అంజనీకుమార్ అందించారు. 30 కేసుల్లో ఒక సంవత్సరం నుంచి యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయని సీపీ వివరించారు. 4 కేసుల్లో జీవిత కారాగార శిక్ష, 3 కేసుల్లో పదేండ్ల జైలు, 13 కేసుల్లో మూడేండ్ల జైలు, 5 కేసుల్లో రెండేండ్ల జైలు, 5 కేసుల్లో ఒక సంవత్సరం పాటు జైలు శిక్షలు పడ్డాయని సీపీ తెలిపారు. డాక్టర్ కె.అజయ్, అదనపు పీపీ గ్రేడ్-1, పీపీ రవీందర్‌రెడ్డి తదితరులు బాగా పనిచేశారని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ(క్రైమ్స్) శిఖా గోయెల్, సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి పాల్గొన్నారు.

Related Stories: