సోషల్ మీడియా వైరల్‌పై ఆంక్షలు

హైదరాబాద్ : ప్రజలను భయాందోళనకు గురి చే స్తున్న చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా లు, హంతక ముఠాల సంచారంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వాటిపై నగర కొత్వా ల్ అంజనీకుమార్ నిషేధించారు. ఈ సందర్భంగా ఆంక్షలను విధిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.మన నగరానికి సంబంధం లేని ఈ విడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేసినా వారిపై చట్టపరమైన చర్యులు ఉంటాయన్నారు. కొంతమంది అల్లరిమూకలు, అకతాయిలు జంటనగరాల్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారని, దొంగతనాల కోసం వచ్చి ప్రజలను చంపేస్తున్నారని సోషల్ మీడియాలోని ఫేసుబుక్, ట్విటర్, వాట్సాప్ ఇంకా తదితర మాధ్యామాల్లో పుకార్లను సృష్టిస్తున్నారు.

దీని వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన, అభద్రత నెలకొందన్నారు. ఈ పుకార్ల కారణంగా కొన్ని సంఘటనల్లో అమాయకులపై అనుమానంతో దాడు లు జరిగాయి. వాటిలో కొంతమంది చనిపోగా మరికొందరు గాయపడ్డారని చెప్పారు. ఈ సంఘటనలకు బాధ్యులైన వారిని అరెస్టు చేశామన్నారు. ఈ నేపథ్యంలో వ దంతులను అడ్డుకునేందుకు తీసుకునే చర్యలో భా గంగా ఈ అంక్షలు విధిస్తున్నట్లు ఆయన వివరించారు. అల్లరిమూకలు పంపించే వీడియోలు, ఫొటోలను వైరల్ కాకుండా ఉండేందుకు జూన్ 1 నుంచి 15 వర కు వాటిపై అంక్షలను అమ లు చేస్తూ ఆ విడియోలు, ఫోటోల పై నిషేధం విధిస్తున్నట్లు అంజనీకుమార్ తెలిపారు.

సోషల్ మీడియా చక్కర్‌లు కొడుతున్న ఈ వీడియోలు, ఫొటో లు మన నగరానికి ఏమాత్రం సంబంధం లేదని, అంతేకాకుండా అలాంటి ముఠాలు నగరంలో లేవని ఆయ న తేల్చిచెప్పారు. కాబట్టి ప్రజలు కూడా కలవరాన్ని సృష్టిం చే ఈ వీడియోలు, ఫొటోలను ఇతర గ్రూపులకు షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆంక్షల సమయంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారి పై సెక్షన్స్ 188, 290, 505(1)(b) అండ్ (c), 506, 109 ఐపీసీ, 76 హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్-1348 ఫాస్లీ కింద కేసులను నమోదు చేస్తామని వివరించారు.

Related Stories: