నిజాం మ్యూజియం చోరీ కేసు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ : పాతబస్తీలోని నిజాం మ్యూజియంలో ఈ నెల 3వ తేదీన ధూమ్-2 సినిమా తరహాలో ఘరానా దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ షాన్ అయిన నిజాం మ్యూజియం నుంచి వజ్రాలు పొదిగిన బంగారు పాత్రలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు నిందితులు పాతబస్తీకి చెందిన వారేనని.. మ్యూజియంలో చోరీ చేసిన అనంతరం గుల్బర్గాకు పారిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితు నుంచి వజ్రాలు పొదిగిన టిఫిన్ బాక్స్, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసును ఛేదించేందుకు 15 బృందాలు రంగంలోకి దిగాయి.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..