హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న అంతర్ పాఠశాలల క్రీడాంశాలలో నిర్వహించే పోటీ షెడ్యూల్ వెల్లడించారు. 2018-2019 సీజన్‌కు గాను బాలబాలికల విభాగంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్‌లకు సంబంధించిన వివరాలను తేదీలను హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్య నిర్వాహక కార్యదర్శి సాయి కుమార్ ప్రకటించారు. ఆర్చరీ టోర్నమెంట్‌ను ఈ నెల (సెప్టెం బర్) 14,15వ తేదీల్లో ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో, ఫెన్సింగ్ టోర్నమెంట్‌ను లాల్‌బహుదూర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని వివరాలకు పి.హరికృష్ణను 9440567395 సంప్రదించాలని సాయి కుమార్ కోరారు. ఈ నెల 14,15 తేదీల్లో కరాటే టోర్నమెంట్ బాలబాలికల అండర్-14,17 విభాగంలో పోటీలను దోమలగూడ ప్రభుత్వ వ్యాయామ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు బీ.విక్రమ్ 9390 941942 సంప్రదించాలి. తైక్వాండో టోర్నమెంట్‌ను ఈ నెల14,15వ తేదీల్లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు జి.నర్సింగ్‌రావు-81431234 65, టగ్-ఆఫ్-వార్ రాజు-9440830967, యోగాఎంఎల్.సత్యనారాయణ- 9550177243 వుష్ జి.జగన్ 9948324824, కిక్ బాక్సింగ్ సల్లా ఉద్దీన్-9396392532, సైక్లింగ్ టీవీ.సునీత 9553444788, టెన్నికాయి ట్ కే. ఆర్‌వీ.శ్యామ్‌సుందర్-8977243409 సంప్రదించాలని కోరారు.

Related Stories: