హైదరాబాద్ పేలుళ్ల కేసు.. తారిఖ్ అంజూమ్ దోషి

హైదరాబాద్: 25 ఆగస్టు 2007న నగరంలోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్‌లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించిన తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించింది. తారిఖ్ అంజూమ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. తారిఖ్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు కోర్టు స్పష్టం చేసింది. కాసేపట్లో శిక్షలు ఖరారు ఇదివరకే అనీఖ్, ఇస్మాయిల్ అక్బర్‌ను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. దీంతో తారిఖ్‌తో కలిపి దోషులందరికీ కాసేట్లో కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. సాదిక్ ఇష్రార్, ఫారూక్ షర్ఫోద్దీన్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేవని అభియోగాలు కొట్టివేసింది. అయితే.. కీలక నిందితులు రియాజ్ బత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు.

Related Stories: