వెంకీ స‌ర‌స‌న బాలీవుడ్ భామ‌..!

టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ జోరుకి ఊపు తెచ్చిన హీరో వెంక‌టేష్‌. గ‌తంలో మ‌హేష్ తో క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే చిత్రాన్ని చేసిన వెంకీ ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి గోపాల గోపాల అనే చిత్రం చేశాడు. ఈ రెండు మంచి విజ‌యం సాధించాయి. ఇక త్వ‌ర‌లో వరుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 2 అనే ప్రాజెక్ట్‌ని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. ఈ మూవీతో పాటు కేఎస్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో చైతూతో క‌లిసి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. మామ అల్లుళ్ళ కాంబినేషన్ లో రానున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సాగేలా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసారని, చైతూ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంద‌ని అన్నారు.

కాని తాజా స‌మాచారం ప్ర‌కారం వెంకీ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీని ఎంపిక చేశార‌ని అంటున్నారు. కాలా చిత్రంలో ర‌జనీకాంత్ స‌ర‌స‌న న‌టించిన హుమా ఖురేషీ ఇప్పుడు వెంక‌టేష్ చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తుంది. ఇక చైతూ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. ఇదే నిజ‌మైతే వీరిద్ద‌రు క‌లిసి న‌టించడం రెండో సారి అవుతుంది. 2017లో వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్ధాం చిత్రంలో చైతూ, ర‌కుల్ జంట‌గా న‌టించారు. ఈ ప్రాజెక్ట్‌ని మూడు ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు నిర్మించ‌నున్నాయి. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

Related Stories: