అమెజాన్‌లో హువావే ప్రత్యేక సేల్.. ఫోన్లపై తగ్గింపు ధరలు..!

అమెజాన్ సైట్‌లో హువావే ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ రోజు ప్రారంభమైన ఈ సేల్ రేపటి వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా పలు హువావే స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఇవ్వడంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ సదుపాయాలను కూడా కల్పించారు.

సేల్‌లో భాగంగా హువావే పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10వేల తగ్గింపు ధరకు రూ.59,999 కు కొనుగోలు చేయవచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే హువావే నోవా 3 రూ.34,999 ధరకు (రూ.4వేల అదనపు డిస్కౌంట్ ఎక్స్‌ఛేంజ్‌పై), నోవా 3ఐ రూ.20,490 ధరకు (రూ.500 తగ్గింపు), హువావే పీ20 లైట్ రూ.17,999 ధరకు (రూ.2వేల తగ్గింపు) అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ఫోన్లను కొన్నవారికి అమెజాన్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.

× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు