ఈ నెల 12న విడుదల కానున్న హువావే మైమాంగ్ 7 స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 7 ను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనుంది. రూ.35,560 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

హువావే మైమాంగ్ 7 ఫీచర్లు... 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

× RELATED తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం