కాంతివంతమైన చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి ...

అందంగా తయారవడానికి ప్రతిరోజూ ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం. కానీ, అతి తక్కువ సమయంలోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి బేకింగ్‌సోడా, తేనె సరిపోతుంది. వీటితో చేసే ప్యాక్ మీ ముఖాన్ని ఫ్రెష్‌గానూ, కాంతివంతంగానూ మారుస్తుంది. *ఆలివ్ నూనె, తేనెను బాగా కలుపాలి. అందులో కొంచెం బేకింగ్ సోడాని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై ఐప్లె చేయాలి. మూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. * 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చర్మం జిడ్డుగా అనిపిస్తే టోనర్‌ను రాసుకోవాలి. *బేకింగ్ సోడా చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలిగిస్తుంది. ఇన్ఫెక్షన్, ఎర్రబారడం నుంచి కాపాడుతుంది. మొటిమలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. *ఆలివ్ ఆయిల్ వల్ల శరీరం కాంతివంతంగా మృదువుగా అయ్యేందుకు దోహదపడుతుంది. చర్మ కణాలను బాగు చేయడమే కాకుండా నిర్జీవ కణాలను తొలిగిస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. *తేనె చర్మానికి బ్లీచింగ్ చేయడానికి, కాంప్లెక్సేషన్ బాగు పడేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయడానికి తేనె ఎంతో ఉపయోగపడుతుంది. *ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ప్రయత్నించడం వల్ల ముఖంలో మార్పును గమనించవచ్చు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?