మీ శరీరానికి ఇ విటమిన్ అందాలంటే..

రోజురోజుకు మతిమరుపు పెరుగుతుందా? జుట్టు రాలుతున్నట్టు, చర్మం ముడుతలు పడుతున్నట్టు అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో ఇంధనం లోపించిందన్నమాట. ఇంధనమంటే.. ఏదో కాదు.. విటమిన్ ఇ. మీ శరీరానికి సరిపడా ఇ విటమిన్ అందాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి.

* బ్రిటీష్ ఆరోగ్య నిపుణులు నిర్వహించిన పరిశోధనలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువగా విటమిన్ ఇ లోపం వారే ఉన్నారట. * ఆలీవ్ ఆయిల్, బాదంపప్పు, సన్‌ఫ్లవర్ గింజలు, సన్‌ఫ్లవర్ నూనె, బ్రొకోలి, రొయ్యలు, చేపలు వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. * పాలకూరలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. దీంతో పాటే మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. * ఎముకలను దృఢంగా ఉంచడంలో విటమిన్ ఇ పాత్ర చాలా ఎక్కువ. * శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ను మెరుగుపరిచే లక్షణాలు ఇ విటమిన్‌లో ఉంటాయి. అందుకే రోజుకు నాలుగైదు బాదం గింజలు తినాలి. * చర్మం ముడుతలు పడడం, జుట్టు బలహీనంగా తయారవడం వంటి సమస్యలకు బాదంలో ఉండే విటమిన్ ఇ చెక్ పెడుతుంది. * వెజిటెబుల్ ఆయిల్స్‌లో ఇ విటమిన్ కావల్సినంత దొరుకుతుంది. పొద్దు తిరుగుడు, ఆలీవ్ కనోలా వంటి ఆకుకూరలు రెగ్యులర్‌గా తినండి. * శరీరంలో కావాల్సినంత ఇ విటమిన్ ఉంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ కణాలను నశింపచేస్తాయి. * విటమిన్ ఇ జీవక్రియలు సక్రమంగా జరుగడానికి దోహదపడుతుంది.

× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు