రెండు నూతన స్మార్ట్‌బ్యాండ్లను విడుదల చేసిన హువావే

మొబైల్స్ తయారీదారు హువావే హానర్ బ్యాండ్ 4, హ్యానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్ పేరిట రెండు నూతన స్మార్ట్‌బ్యాండ్లను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ స్మార్ట్‌బ్యాండ్లు విడుదల కానున్నాయి. రూ.2090 ధరకు హానర్ బ్యాండ్ 4 లభ్యం కానుండగా, రూ.1,040 ధరకు హానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్ లభించనుంది.

హానర్ బ్యాండ్ 4 లో 0.95 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 100 ఎంఏహెచ్ బ్యాటరీ 14 రోజుల యూసేజ్ టైం తదితర ఫీచర్లు ఉండగా, హ్యానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్‌లోనూ ఇవే ఫీచర్లను అందిస్తున్నారు. కాకపోతే ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్ సెన్సార్ లేదు. ఇక బ్యాటరీ 77 ఎంఏహెచ్ కెపాసిటీ మాత్రమే కలిగి ఉంది.

Related Stories: