తెలుగు రాష్ర్టాల్లోనే రిటైల్ రుణాల్లో అధిక వృద్ధి

ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి హైదరాబాద్, సెప్టెంబర్ 20: దేశీయ సగటు కన్నా తెలుగు రాష్ర్టాల్లో రిటైల్ రుణాల వృద్ధి రేటు అధికంగా వుందని, ఈ ఏడాది 30 శాతం పైగా వృద్ధితో రూ. 12,500 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి తెలిపారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వినియోగ రుణాల్లో 30 శాతం, గృహరుణాల్లో 25 శాతం వృద్ధి రేటును సాధించనున్నట్టు తెలిపారు. రూ.5,500 కోట్ల వినియోగ రుణాలను, రూ.4,000 కోట్ల గృహ రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అందించనున్నట్టు తెలిపారు. వాహన రుణాల జారీ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖతో ఒప్పందం కుదుర్చుకుని గ్రామీణ ప్రాంత ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేకంగా రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. రిటైల్ రుణాల విభాగంలో ఎన్‌పీఏలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రెండు రాష్ర్టాల్లో కలిపి మొత్త0 340 శాఖలు, 1420 ఏటీఎంలతో విస్తృత స్థాయిన నెట్‌వర్క్‌ను కలిగి ఉండగా, ఇందులో సగం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలోకలిగి ఉన్నట్టు అనూప్‌బాగ్చి వెల్లడించారు.

నగరాల్లోకన్నా సెమీ అర్బన్‌ప్రాంతాల్లోనే డిపాజిట్ వృద్ధి అత్యధికంగా ఉందన్నారు. కాగా, బ్యాంకులో జరుగుతున్న మొత్తం లావాదేవీల్లో 85 శాతం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 110 మునిసిపాలిటీల్లో నిర్మాణ అనుమతులకు సంబంధించిన రుసుములను, వైజాగ్ మునిపల్ కార్పొరేషన్‌లో అస్తిపన్ను వసూళ్లకు ప్రత్యేకంగా ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు తెలిపారు. రెండు రాష్ర్టాల్లో మొత్తం 42 లక్షల బీఎస్‌బీ అకౌంట్లను కలిగి ఉన్నట్టు తెలిపారు. 67 గ్రామాలను డిజిటల్ గ్రామాలకు రూపొందించి వారికి రుణ సదుపాయం శిక్షణ వంటి అందిస్తున్నామని, ఈ గ్రామాల్లో ప్రస్తుతం లావాదేవీలు 25 శాతం వరకు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు.

Related Stories: