ఎఫ్‌2 టీంతో క‌లిసిన అందాల భామ‌లు

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఎఫ్‌2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఎఫ్‌2 చిత్రం రూపొందుతుంది. అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. రీసెంట్‌గా చిత్ర నిర్మాత‌లు ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. ఇప్ప‌టికే చిత్ర బృందంతో వ‌రుణ్ తేజ్‌, వెంక‌టేష్ క‌ల‌వ‌గా నిన్న అందాల భామ‌లు మెహ‌రీన్ పీర్జా, త‌మ‌న్నా సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఈ విష‌యాన్ని మెహ‌రీన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టించ‌నుండ‌గా, మెహ‌రీన్ పీర్జా మెగా హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తోడ‌ళ్ళుగా వెంకీ, వ‌రుణ్‌లు న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?