ముక్కోణపు ప్రేమాయణం

నందు, నోయల్, పునర్నవి భూపాలం నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఎందుకో ఏమో. కోటి వద్దినేని దర్శకుడు. మాలతి వద్దినేని నిర్మాత. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ప్రేమ ప్రయాణంలోని మధురభావనలకు అద్దం పడుతుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు హృదయాన్ని స్పృశిస్తాయి. స్వచ్ఛమైన ప్రేమకు దర్పణంలా సినిమా సాగుతుంది అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వినూత్న ప్రేమకథా చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులుంటాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది అని నిర్మాత తెలిపారు. చక్కటి ప్రేమకథా చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, సూర్య, సుడిగాలి సుధీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.యస్.రాజ్, సంగీతం: ప్రవీణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోటి వద్దినేని.